చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

రెంజల్‌, ఫిబ్రవరి 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని దూపల్లి గ్రామానికి చెందిన పల్లె సాయిలు (35) అనే వ్యక్తి పురుగుల మందు తాగి మృతి చెందినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఈనెల 14వ తేదీన అనారోగ్య కారణంగా పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో చికిత్స నిమిత్తం నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడి భార్య నవనీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Check Also

29న సర్వసభ్య సమావేశం

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »