డిచ్‌పల్లి, ఫిబ్రవరి 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ రవీందర్ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విభిన్న విభాగాలకు చెందిన తరగతి గదులు, సైన్స్ విభాగాలకు చెందిన ల్యాబ్స్ సందర్శించారు. విద్యార్థులు ల్యాబ్స్ సద్వినియోగం చేసుకోవాలని, తరగతులకు క్రమం తప్పకుండా హాజరుకావాలని తెలిపారు. త్వరలో జరిగే సెమిస్టర్ పరీక్షలకు సిద్ధం కావాలన్నారు.
సైన్స్ విద్యార్థులు ల్యాబ్‌లను ఉపయోగించుకొని పరిశోధనలపై ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, ఆర్ట్స్ కళాశాల పార్కింగ్ స్థలం సరిపోవడం లేదని పార్కింగ్ స్థలం విస్తరించాలని వీసీని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించి ఆర్ట్స్ కాలేజ్ పార్కింగ్ స్థలాన్ని విస్తరించాలని ఏ.ఇ. వినోద్‌ని ఆదేశించారు. వైస్ ఛాన్స్‌లర్ వెంట రిజిస్టార్ ప్రొఫెసర్ విద్యావర్ధిని, ఇసి మెంబర్ డాక్టర్ రవీందర్ రెడ్డి, ప్రొఫెసర్ నసీం, ఇసి మెంబర్, అధ్యాపకులు డాక్టర్ నాగరాజు, డాక్టర్ ప్రవీణ్ మామిడాల, ప్రొఫెసర్ కనకయ్య, డాక్టర్ పున్నయ్య తదితరులు ఉన్నారు.