రెంజల్, ఫిబ్రవరి 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని బోరువం గ్రామంలో ఆదామా పురుగుల మందు కంపెనీ వారి ఆధ్వర్యంలో రూ.5లక్షల 50 వేల రూపాయల వ్యయంతో ఏర్పాటుచేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను గురువారం స్థానిక సర్పంచ్ వాని సాయి రెడ్డి ఆదామా కంపెనీ సౌత్ ఇండియా మేనేజర్ పాపునాయుడు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదామా కంపెనీ పురుగుల మందు వ్యాపారంతో ప్రారంభమై నేడు అనేక రకాల సంక్షేమ కార్యక్రమాల్లో ముందుంటుందని గ్రామీణ ప్రాంతంలో రైతుల పంటలకు పురుగుమందులతో పాటు అందరికీ ఉపయోగపడే విధంగా సేవ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, విద్యార్థుల చదువు కోసం స్కాలర్షిప్లను అందించడం జరిగిందని, తెలంగాణ రాష్ట్రంలోని మొదటిసారిగా బోర్గం గ్రామంలో ఆర్వో వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
కార్యక్రమంలో సౌత్ ఇండియా మేనేజర్ పాపునాయుడు, తెలంగాణ, రాయలసీమ సేల్స్ మేనేజర్ సతీష్, తెలంగాణ, రాయలసీమ మార్కెటింగ్ మేనేజర్ శివప్రసాద్, నిజామాబాద్ రీజియన్ సేల్ల్స్ మేనేజర్ రాజు శరత్, మార్కెటింగ్ మేనేజర్ విశ్వనాథ్, సొసైటీ చైర్మన్ మొయినుద్దీన్, విద్యకమిటి చైర్మన్ నాగన్న, డీలర్లు శ్రీనివాస్ రెడ్డి, మోహన్ రెడ్డి గ్రామస్థులు, సంతోష్, రాజు తదితరులు ఉన్నారు.