డిచ్పల్లి, ఫిబ్రవరి 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యోగా శిక్షణ తరగతులను గురువారం సాయంత్రం 4:30 గంటలకు తెలంగాణ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లోని సమావేశ మందిరం లో వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా వైస్ చాన్స్ లర్ మాట్లాడుతూ.. యోగ అభ్యాసం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని, మానసిక ఒత్తిడి తగ్గుతుందని అన్నారు.
మానసిక ప్రశాంతతకు యోగ అభ్యాసం అందరు విద్యార్థులు తప్పనిసరిగా నేర్చుకోవాలన్నారు. తెలంగాణ యూనివర్సిటీలోని విద్యార్థిని, విద్యార్థుల యోగ శిక్షణ కొరకు యోగా గురువు సిద్ది రాములును నియమించామ ని వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ తెలిపారు. యోగా శిక్షణ తరగతులలో అన్ని విభాగాలకు చెందిన పీజీ విద్యార్థిని లు పాల్గొన్నారు.