తిరుమలలోని గోగర్భం సమీపంలో వెలసిన రుద్రుని రూపమైన క్షేత్రపాలకుడికి ఫిబ్రవరి 18వ తేదీన మహాశివరాత్రి పర్వదినం ఘనంగా నిర్వహిస్తారు. రుద్రుడు తిరుమల క్షేత్రానికి పాలకునిగా ఉన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఏటా ఇక్కడ అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ముందుగా శ్రీవారి ఆలయం నుండి ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు క్షేత్రపాలక శిల వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు సుగంధద్రవ్యాలతో క్షేత్రపాలకునికి అభిషేకం చేసి నైవేద్యం సమర్పిస్తారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేస్తారు.