ఎడపల్లి, ఫిబ్రవరి 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆయుష్మాన్ భారత్ కార్డుతో దేశంలో ఎక్కడైనా ఉచిత వైద్యసేవలు పొందవచ్చని ఆరోగ్య మిత్ర విద్యావతి తెలిపారు. శుక్రవారం స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద కొనసాగుతున్న ఆయుష్మాన్ భారత్ కార్డు నమోదు కార్యక్రమంలో ప్రజలకు ఆయుష్మాన్ భారత్ కార్డు నమోదు వల్ల చేకూరే ప్రయోజనాలు తెలియజేస్తూ నమోదు కార్యక్రమాన్ని కొనసాగించారు.
ఆరోగ్యశ్రీ కార్డు లేనివారు ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, అంగ న్‌వాడీ టీచర్ల ద్వారా ఆయుష్మాన్ భారత్ కార్డులు పొందవచ్చని తెలిపారు. ఈ కార్డు ద్వారా దేశంలో ఎక్కడైనా ఉచితంగా రూ.5 లక్షల వరకు వైద్యసేవలు పొందవచ్చని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యసేవలు పొందే అవకాశం ఉంటుందన్నారు.