కామారెడ్డి, ఫిబ్రవరి 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ సేవాదళ్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం తల సేమియా సికిల్ సెల్ సొసైటీ హైదరాబాదులో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఐ.వి.ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడారు.
కేసీఆర్ జన్మదిన సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల రక్తదాన శిబిరాన్ని, అన్నదాన కార్యక్రమాలను వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ కార్యక్రమాలను నిర్వహించామన్నారు. ఆర్యవైశ్యులకు అన్ని రంగాల్లో కేసీఆర్ సముచిత స్థానం కల్పించడం జరిగిందన్నారు. గత ఆరు నెలలోనే తల సేమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం 800 ల యూనిట్ల రక్తాన్ని అందజేసిన సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలును అభినందించారు.
రక్తదానం చేసిన రక్తదాతలకు ప్రశంస పత్రాలను జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్ వేద ప్రకాష్, ప్రధాన కార్యదర్శిలు గంప ప్రసాద్, పుట్ల అనీల్, శ్రీనివాస్, కిరణ్, అంజల్ రెడ్డి, సాయి, నిశాంత్ రెడ్డి, వంశీకృష్ణ పాల్గొన్నారు.