బాన్సువాడ, ఫిబ్రవరి 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని స్పీకర్ పోచారం నివాసంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన పురస్కరించుకొని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి నాయకులతో కలిసి కేక్ కట్చేసి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కొరకు అనునిత్యం పాటుపడుతూ కేవలం ఎనిమిది సంవత్సరాలలోనే రాష్ట్ర భవిష్యత్తును అద్భుతంగా మార్చి రాష్ట్ర ఆదాయాన్ని గణనీయంగా పెంచారన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వల్ల తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని దేశంలోనే తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా మారిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించామని ఆయన అన్నారు.
కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, గోపాల్ రెడ్డి, నారాయణరెడ్డి, పాత బాలకృష్ణ, కౌన్సిలర్ లింగమేశ్వర్, ఏజస్, రమాదేవి రాజాగౌడ్, రుక్మిణి గైక్వాడ్, అమీర్ చావుస్, రాజేశ్వర్ గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.