కామారెడ్డి, ఫిబ్రవరి 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్ వాయి గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా గత మూడు రోజులుగా మహాశివరాత్రి పురస్కరించుకొని ఆలయ అర్చకులు రాజమౌళి, శంకర్, గంగన్న అధ్వర్యంలో మొదటి రోజు పల్లకి సేవ, అగ్నిహోమం, పూర్ణాహుతి శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం, ఒడిబియ్యం, పూర్ణాహుతి, రెండవ రోజు స్వామివారికి విశేషా అభిషేకాలు స్వామివారిని గ్రామములో రథోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
గత మూడు రోజులుగా ఏ దేవాలయములో కూడా జరుగనటువంటి అన్నదానం శ్రీ నవ దుర్గ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయములో జరుగుతుందని ఆలయ అర్చకులు, రాజమౌలి గ్రామ సర్పంచ్ కొత్తొల్ల గంగారం తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ కమిటీ, డెవలప్మెంట్ కమిటీ, గ్రామ ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.