బాన్సువాడ, ఫిబ్రవరి 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు సంరక్షణ కేంద్రం (దవాఖాన) జాతీయ స్థాయిలో గుర్తింపు లభించినందున శనివారం ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్‌కు దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి గౌరవ అధ్యక్షులు అయ్యల సంతోష్ మాట్లాడుతూ తల్లి పాలను ప్రోత్సహిస్తున్న బ్రెస్ట్ ఫీడిరగ్ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేటివ్ అందించే బ్రెస్ట్ ఫీడిరగ్ ఫ్రెండ్లి అక్రిడిటేషన్ గ్రేడ్ 1 బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రి సొంతం చేసుకోవడం డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయమన్నారు.
అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిని పేద ప్రజల కొరకు తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏర్పాటు చేయడం, బాన్సువాడను అభివృద్ధి చేస్తూ, అన్ని రకాలుగా బాన్సువాడ నియోజకవర్గాన్ని తెలంగాణలోనే ముందు వరుసలో ఉంచుతున్నారన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డికి బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని అన్నారు.
కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి గౌరవ అధ్యక్షులు అయ్యల సంతోష్, ఎజాస్, అధ్యక్షుడు కాదేపురం గంగారం, ప్రదాన కార్యదర్శి గైని ప్రవీణ్ కుమార్, కోశాధికారి పెంటయ్య, ఉపాధ్యక్షుడు గైని సురేష్, దత్తు, మన్నే భూషణ్, పరుశురాం, రవి, గంగాధర్, సాయిరాం, సాయిలు, లింగం, తదితరులు పాల్గొన్నారు.