Daily Archives: February 20, 2023

భూగర్భ జలాలను పెంపొందించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పథకం ద్వారా ఉట చెరువులు, ఫామ్‌ ఫండ్స్‌ నిర్మాణం చేపట్టి భూగర్భ జలాలను పెంపొందించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం మండల స్థాయి అధికారులతో పోడు భూములు, దళిత బంధు, ఉపాధి హామీ పథకం, ధరణి పోర్టల్‌ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. …

Read More »

ఒత్తిడిని అధిగమిస్తే మంచి గ్రేడిరగ్‌ పొందవచ్చు

కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ సూచనల మేరకు జిల్లా మెంటల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ సైకియాట్రిస్ట్‌ డాక్టర్‌ జి.రమణ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నంత పాఠశాలలో విద్యార్థులకు మానసిక ఒత్తిడిపై పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు ఆరోగ్య పరిరక్షణకు, ప్రణాళిక ప్రకారం చదువుకోవాల్సిన తీరును తెలిపారు. విద్యార్థుల్లో ఎదురయ్యే భయాలు, కోపాలు, ఒత్తిడిలను అధిగమించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. …

Read More »

కల్లుబట్టిని తొలగించాలి

ఎడపల్లి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ గ్రామానికి వెళ్లే రహదారిలో గల కల్లుబట్టి వల్ల గ్రామానికి చెందిన మహిళలు, పాఠశాల, కళాశాల విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దానిని అక్కడి నుంచి తొలగించాలని కోరుతూ ఎడపల్లి మండలంలోని ధర్మారం గ్రామస్తులు సోమవారం బోధన్‌ ఏసీపీ కిరణ్‌ కుమార్‌కు, బోధన్‌ ఎక్సైజ్‌ సీఐ రూప్‌ సింగ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా గ్రామస్తులు మాట్లాడారు. ఎమ్మెస్సి …

Read More »

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తామన్నారు. …

Read More »

ప్రజావాణికి 80 ఫిర్యాదులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 80 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, డీఆర్డీఓ చందర్‌ లకు విన్నవిస్తూ …

Read More »

మూగజీవాల పట్ల ప్రేమ, దయ కలిగి ఉండాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల నిర్వహించిన జంతు సంక్షేమ పక్షోత్సవాల సందర్భంగా నిర్వహించబడిన జిల్లాస్థాయి ఉపన్యాస పోటీలలో నెగ్గిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్‌, జంతు సంక్షేమ మండలి చైర్మన్‌చే జారీ చేయబడిన ప్రశంసా పత్రములను, మెమొంటోలను అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు జంతు సంక్షేమం పట్ల అవగాహన పెంపొందించుకొని ఇతరులకు …

Read More »

మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డును అందించలేం…

ఎడపల్లి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ స్కూల్లలో విద్యార్థులకు అందిస్తున్న కోడిగుడ్డుకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వం తమకు డబ్బులు చెల్లించడం లేదని మార్కెట్‌లో 7 రూపాయలకు కొనుగోలు చేసి విద్యార్థులకు అందిస్తే ప్రభుత్వం తమకు కేవలం రూ.5 అందించడం వల్ల ఒక్కో గుడ్డుకు రూ. 2 వరకు నష్టపోతున్నామని ఇకనుండి మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డును పెట్టలేమని దీనికి సహకరించాలని కోరుతూ సోమవారం తెలంగాణా …

Read More »

నగర పాలక సంస్థ 2023-2024 సంవత్సరపు బడ్జెట్‌ ఆమోదం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిజామాబాద్‌ నగరపాలక సంస్థ ప్రతిపాదించిన బడ్జెట్‌ ఆమోదం పొందింది. సోమవారం స్థానిక న్యూ అంబెడ్కర్‌ భవన్‌ లో నగర మేయర్‌ దండు నీతూకిరణ్‌ అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో నిజామాబాద్‌ అర్బన్‌ శాసనసభ్యులు బిగాల గణేష్‌ గుప్తా, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా పాల్గొన్నారు. 2023 -2024 సంవత్సరానికి …

Read More »

ఎర్రజొన్న కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకూడదు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎర్రజొన్న కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మార్కెట్‌ రేటుకు అనుగుణంగా ధరను చెల్లిస్తూ పంటను సేకరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సీడ్‌ కంపెనీల ప్రతినిధులకు సూచించారు. ఎర్రజొన్న దిగుబడులు చేతికందుతున్న నేపథ్యంలో, కలెక్టర్‌ సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్లో విత్తన వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. రైతులతో కుదుర్చుకున్న బైబ్యాక్‌ ఒప్పందానికి కట్టుబడి …

Read More »

పరీక్ష తేదీలు మార్పు

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని పీజీ మొదటి మరియు మూడవ సెమిస్టర్‌ (ఎంసిఎ, ఎంబిఎ, ఎల్‌ఎల్‌ఎం, ఎల్‌ఎల్‌బి), 5 వ సెమిస్టర్‌, ఎల్‌ఎల్‌బి, ఐఎంబిఎ 7వ మరియు 9వ సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 24వ తేదీ నుండి ప్రారంభం కావాల్సి ఉండగా వాయిదా వేశామని ఈ పరీక్షలు మార్చ్‌ 8వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »