ఎర్రజొన్న కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకూడదు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎర్రజొన్న కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మార్కెట్‌ రేటుకు అనుగుణంగా ధరను చెల్లిస్తూ పంటను సేకరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సీడ్‌ కంపెనీల ప్రతినిధులకు సూచించారు. ఎర్రజొన్న దిగుబడులు చేతికందుతున్న నేపథ్యంలో, కలెక్టర్‌ సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్లో విత్తన వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. రైతులతో కుదుర్చుకున్న బైబ్యాక్‌ ఒప్పందానికి కట్టుబడి కొనుగోళ్లు జరగాలన్నారు.

ఎర్రజొన్న సాగుకు అవసరమైన విత్తనాల సరఫరా, రైతులతో ఒప్పందం కుదుర్చుకునే విధానం, విత్తనాల వెరైటీలు తదితర అంశాల గురించి వ్యాపారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల నుండి సేకరించిన ఎర్రజొన్న పంటను ఢల్లీి, పంజాబ్‌, హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తామని, అక్కడ ఎర్రజొన్నను పశువులకు దాణాగా వినియోగిస్తారని సీడ్‌ కంపెనీల ప్రతినిధులు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు.

గతేడాది సాగు చేసిన ఎర్రజొన్న పంటను పలువురు రైతులు కోల్డ్‌ స్టోరేజ్‌ లలో నిలువ చేసుకుని ఈ ఏడాది విక్రయించారని తెలిపారు. అయినప్పటికీ, ఈసారి అత్యధిక మంది మొక్కజొన్న పంట వైపు మొగ్గు చూపడంతో ఎర్రజొన్న సాగు విస్తీర్ణం తగ్గిందని అన్నారు. ఫలితంగా ప్రస్తుతం మార్కెట్లో ఎర్రజొన్న పంటకు ఆశించిన రీతిలోనే మంచి డిమాండ్‌ ఉందని తెలిపారు. రైతులతో కుదుర్చుకున్న ఒప్పందానికి మించి ఎర్రజొన్నకు ఎక్కువ మొత్తంలో ధర పలుకుతోందని అన్నారు.

ఎలాంటి సమస్యలకు తావులేకుండా కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్‌, విత్తన కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »