కామారెడ్డి, ఫిబ్రవరి 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధి హామీ పథకం ద్వారా ఉట చెరువులు, ఫామ్ ఫండ్స్ నిర్మాణం చేపట్టి భూగర్భ జలాలను పెంపొందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం మండల స్థాయి అధికారులతో పోడు భూములు, దళిత బంధు, ఉపాధి హామీ పథకం, ధరణి పోర్టల్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
ఉపాధి హామీ ద్వారా గ్రామాల్లో కూలీల సంఖ్యను పెంచాలని తెలిపారు. పోడు భూములు అర్హత గల వారికి ఇవ్వడానికి లబ్ధిదారుల ఎంపిక సజావుగా చేపట్టాలని చెప్పారు. అర్హత గల వారి జాబితాను రూపొందించాలని పేర్కొన్నారు. ధరణి పోర్టల్‌లో పెండిరగ్ ముటేషన్లు లేకుండా చూడాలన్నారు.
మండలాల వారికి పెండిరగ్‌లో ఉన్న ముటేషన్లు పరిశీలించాలని సూచించారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, ఆర్డీవోలు శ్రీనివాస్ రెడ్డి, శీను, డిఆర్‌డిఓ సాయన్న, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.