కామారెడ్డి, ఫిబ్రవరి 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ సూచనల మేరకు జిల్లా మెంటల్ హెల్త్ ఆఫీసర్ సైకియాట్రిస్ట్ డాక్టర్ జి.రమణ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా పరిషత్ బాలికల ఉన్నంత పాఠశాలలో విద్యార్థులకు మానసిక ఒత్తిడిపై పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు ఆరోగ్య పరిరక్షణకు, ప్రణాళిక ప్రకారం చదువుకోవాల్సిన తీరును తెలిపారు. విద్యార్థుల్లో ఎదురయ్యే భయాలు, కోపాలు, ఒత్తిడిలను అధిగమించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
విద్యార్థులు ఒక పద్ధతి ప్రకారం ప్రణాళిక వేసుకొని చదువుకోవాలన్నారు. సమయానికి నిద్ర,ఆహారం తీసుకుంటూ, అనువైన స్థలాన్ని ఎంచుకొని చదువుకోవాలన్నారు. సమస్యలు వస్తే ఉపాద్యాయులకు,తల్లిదండ్రులకు చెప్తే చాలా వరకు ఒత్తిడిని అధిగమించి మంచి మార్కులు, గ్రేడిరగ్ పొందవచ్చునని సూచించారు. జ్ఞానాన్ని సముపార్జించవచ్చని విద్యార్థులకు వివరంగా తెలిపారు. కార్యక్రమంలో సైకియాట్రిక్ సోషల్ వర్కర్ డా.రాహుల్, ఉపాధ్యాయులు దత్తశ్రీ, భవాని, పద్మ, సునీత, ప్రశాంతి, విద్యార్థినిలు పాల్గొన్నారు.