ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తామన్నారు. వాటిని సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి, సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు ఎప్పటికప్పుడు ఆన్‌ లైన్‌ లో నమోదు చేయాలని పేర్కొన్నారు. మొత్తం 64 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌, డిఆర్‌డిఓ సాయన్న, పర్యవేక్షకుడు సాయి భుజంగరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »