కామారెడ్డి, ఫిబ్రవరి 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన మణెమ్మ (55) పట్టణంలోని సురక్ష హాస్పిటల్‌లో ఆపరేషన్ నిమిత్తమై ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తాన్ని కామారెడ్డి రక్తదాతల సమూహం సహకారంతో అందజేసినట్టు ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడు కిరణ్ మాట్లాడుతూ 2007 నుండి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి కావాల్సిన రక్తాన్ని సకాలంలో అందజేయడం జరుగుతుందని, ప్రపంచంలో డబ్బు లేకుండా చేయగలిగే అతి గొప్పనైన సహాయం రక్తదానం మాత్రమే అని అన్నారు.
రక్తదాన చేసిన రక్తదాతలు చింతల శ్రీనివాస్, మయూర్ పటేల్‌కు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మరియు రెడ్ క్రాస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తరపున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వీ.టి.ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది చందన్, ఏసు గౌడ్ పాల్గొన్నారు.