ఆరోగ్య తెలంగాణ సాధించడమే సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష

కామారెడ్డి, ఫిబ్రవరి 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య తెలంగాణ సాధించడమే సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష అని ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి స్మిత సబర్వాల్‌ అన్నారు. బిక్కనూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా గర్భిణీలకు కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

కెసిఆర్‌ న్యూట్రిషన్‌ కిట్టుతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. గర్భిణీల ఆరోగ్య సంరక్షణకు కెసిఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ దోహదపడుతుందని చెప్పారు. గర్భిణీల్లో రక్తహీనత సమస్య ఉండకూడదనే లక్ష్యంతో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. వయసుకు తగ్గ ఎత్తు, బరువు పెరిగి చిన్నారులు చదువుకొని ఉన్నత ఉద్యోగాలు పొందే వీలు ఉంటుందని పేర్కొన్నారు.

కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో గర్భిణీల ఆరోగ్యంపై అధ్యాయం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో మన రాష్ట్రంలో కెసిఆర్‌ న్యూట్రిషన్‌ కిట్టును ప్రారంభించారని చెప్పారు. గర్భిణీ నా ఆరోగ్యం, నా బిడ్డ ఆరోగ్యం బాగుండాలని భావించి కెసిఆర్‌ న్యూట్రిషన్‌ కిట్టు లో ఇచ్చిన పోషకాహారం, మందులను వినియోగించాలని సూచించారు. బలహీనత లేకుండా పుట్టిన పిల్లలు ఆరు సంవత్సరాల వరకు ఆరోగ్యంగా ఉంచితే వారు జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. గర్భిణీల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

మహిళా శిశు సంక్షేమ శాఖ అదనపు కమిషనర్‌ భారతి హోళీ మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు జరిగే విధంగా చూడాలన్నారు. గర్భిణీలు సాధారణ ప్రసవాలు చేసుకుంటే తల్లి, బిడ్డలు ఆరోగ్యకరంగా ఉంటారని తెలిపారు. 18 ఏళ్లు వచ్చేవరకు యువతులకు పెళ్లి చేయవద్దని చెప్పారు. ఇద్దరు పిల్లలు ఉన్న మహిళలు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించుకోవాలని పేర్కొన్నారు. ప్రసవం అయినా గంటలోపు మహిళలు పుట్టిన బిడ్డలకు ముర్రుపాలు తప్పనిసరిగా తాగించాలని సూచించారు.

ముర్రుపాలు తాగడం వల్ల చిన్నారులకు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రాన్ని ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి స్మిత సబర్వాల్‌ సందర్శించారు. చిన్నారులకు, గర్భిణీలకు అందించే పౌష్టికాహారం వివరాలను అంగన్వాడి కార్యకర్తను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య లక్ష్మి ప్రాముఖ్యతను గర్భిణీలను అడిగారు. గర్భిణీలకు హిమాగ్లోబిన్‌ 14 శాతం ఉండే విధంగా చూసుకోవాలని పేర్కొన్నారు. కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించారు.

అర్హత గల వారికి కళ్లద్దాలను పంపిణీ చేశారు. ఎంతమందికి కంటి పరీక్షలు చేశారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ శ్వేతా మహంతి, జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, శిక్షణ కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌, సర్పంచ్‌ వేణు, జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్‌ సింగ్‌, జిల్లా ఉపవైద్యాధికారులు చంద్రశేఖర్‌, శోభారాణి వైద్యులు హేమియా, వెంకటేశ్వర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »