బాన్సువాడ, ఫిబ్రవరి 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని కళాశాల తెలుగు విభాగం మరియు ఎన్ఎస్ఎస్ 1,2,3 యూనిట్ల ఆధ్వర్యంలో కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ ఇందూరు గంగాధర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గంగాధర్ మాట్లాడుతూ అక్షరాన్ని బ్రతికిద్దాము అమ్మ భాషను రక్షించుకుందాం అంటూ మన భాష సంస్కృతి సాంప్రదాయాలకు మన జీవన విధానానికి మూలాధారము అని మాతృభాష తెలుగును పరిరక్షించుకోవడం మన అందరి బాధ్యతని ఆయన అన్నారు.
కార్యక్రమంలో తెలుగు విభాగాధిపతి వెంకట్రావు దీక్షిత్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు రమాదేవి, పోతరాజు శ్రీనివాస్, రాజేష్ అధ్యాపకులు కృష్ణ,శేఖర్, సత్యనారాయణ, లావణ్య,బట్టు విట్టల్, సాజిదాబేగం విద్యార్థులు పాల్గొన్నారు.