డిచ్‌పల్లి, ఫిబ్రవరి 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం ఉదయం 11:30 గంటలకు తెలంగాణ యూనివర్సిటీలోని హెల్త్ సెంటర్‌ని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హెల్త్ సెంటర్‌లో వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ ప్రత్యేక శ్రద్ధతో వసతులు కల్పించడం గొప్ప విషయమని సంతోషం వ్యక్తం చేశారు.
ఆస్పత్రిలోని అన్ని గదులను సందర్శించి చికిత్స పొందుతున్న విద్యార్థినులను అక్కడి సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు హెల్త్ సెంటర్, వైద్యుల సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ రిక్క లింబాద్రి, వైద్యురాలు డాక్టర్ అనూష, సిబ్బందితో ఆస్పత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్టార్ ప్రొఫెసర్ విద్యావర్థిని, డైరెక్టర్ పిఆర్‌ఓ డాక్టర్ ఎండి జమీల్ అహ్మద్ తదితరులు ఉన్నారు.