రెంజల్, ఫిబ్రవరి 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుదర్శనం అన్నారు. మంగళవారం మండలంలోని అంబేడ్కర్ నగర్‌లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన సందర్శించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ. 18 సంవత్సరాల పైబడిన వారందరూ కంటి పరీక్షలు జరిపించుకోవాలని అవసరమైన వారికి రీడిరగ్ గ్లాసులు ప్రిస్క్రిప్షన్స్ గ్లాసులో మందులు మోతి బిందువు ఉన్నవారికి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తామని ఈ సదవకాశాన్ని ప్రజలు సద్వియోగపరుచుకోవాలని అన్నారు. ప్రజలకు చేరువగా గ్రామాల్లోనే కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి ఒకరికి అవసరం మేరకు ఉచిత మందులతో పాటు గ్లాసులను అందించడం జరుగుతుందని అన్నారు.
వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి సేవలను అందించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ మధుర భాయ్, ఉపసర్పంచ్ మూస, పంచాయతీ కార్యదర్శి సునీల్, ఆరోగ్య విస్తీర్ణ అధికారులు కరిపే రవీందర్, శ్రావణ్ కుమార్, సూపర్‌వైజర్ మాలాన్ కంటి వైద్య నిపుణులు ప్రవీణ్, ఇర్ఫాన్, ఆరోగ్య కార్యకర్తలు శాంతకుమారి, సరస్వతి, ఆరోగ్య కార్యకర్తలు తదితరులున్నారు.