కామారెడ్డి, ఫిబ్రవరి 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని విఠలాపురం, ఎల్కూరు, పాలాయి, తాటికుంట, రావులచెరువు జడ్పిహెచ్‌ఎస్ పాఠశాలలో, మల్దకల్ మండల కేంద్రంలో ఉన్నటువంటి జూనియర్ కళాశాల, జడ్పిహెచ్‌ఎస్ పాఠశాలలో బిజెపి బృందం విస్తృతంగా పర్యటించి బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవిఎన్ రెడ్డికి ఓటు వేయాలని ప్రచారం చేశారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేపీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు రామచంద్రరెడ్డి, బీజేపీ జిల్లా ఎంఎల్‌సి ఇంచార్జ్ బండల వెంకట్ రాములు యాదవ్ మాట్లాడుతూ కెసిఆర్ నియంతృత్వ పాలనలో శాసన మండలిలో ప్రతిపక్ష సభ్యులు లేకపోవడం వల్ల పాలకపక్షం యొక్క తప్పులపై ప్రజల తరఫున వాణి వినపడట్లేదని, గతంలో బిజెపి సభ్యులు రామ చంద్ర రావు చాలా చక్కగా నిర్వహించి ఎన్నో సమస్యల పరిష్కారానికి తోడ్పడ్డారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు.
బండి సంజయ్ అధ్వర్యంలో బిజెపి 317, వివిధ సమస్యలపై పోరాడడంవల్ల ఈ రోజు టీచర్స్‌కు డిఏలు రావడం జరిగిందని, జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల సమస్యలపై మరియు విద్యాసంస్థల కోసం తమ నాయకురాలు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణమ్మ నిరంతరం పోరాడుతుందన్నారు.
ఈసారి టీచర్స్ ఉన్నతులు కాబట్టి ఉన్నతమైన నిర్ణయంతో కెసిఆర్‌కు బుదిచెప్పాలని అన్నారు. కార్యక్రమంలో మల్దకల్ మండల బిజెపి అధ్యక్షులు అల్వాల రాజశేఖర్ రెడ్డి, గద్వాల పట్టణ ఉపాధ్యక్షులు కెంచే వెంకటేష్, అయిజ పట్టణ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ రావు, అయిజ పట్టణ ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.