రెంజల్, ఫిబ్రవరి 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలం తాడ్ బిలోలి గ్రామంలో బుధవారం చత్రపతి శివాజీ విగ్రహ నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమాన్ని సర్పంచ్ సునీత నర్సయ్య, ఎంపీటీసీ లక్ష్మీ లింగం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకొని గ్రామంలో విగ్రహ ఏర్పాటు చేయడం అభినందియమన్నారు.
అన్ని వర్గాలు కలిసికట్టుగా ఏర్పడి గ్రామంలో శివాజీ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని ఇట్టి నిర్మాణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములవ్వడం హర్షనియమని వారన్నారు. కార్యక్రమంలో రామాలయం చైర్మన్ లింగాల అబ్బన్న, హనుమాన్ మందిర్ అధ్యక్షుడు గాండ్ల ప్రసాద్, నారాయణ రెడ్డి, ఫకుర్ బేగ్, విజయ్, కోమటి శ్రీనివాస్, మోహన్, నర్సారెడ్డి, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.