రెంజల్, ఫిబ్రవరి 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజలకు ప్రభుత్వాల మధ్య వారదులుగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందించి ఆదుకోవాలని రెంజల్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్ష,కార్యదర్శులు గంగాధర్,సంతోష్ కోరారు. బుధవారం తహసిల్దార్ రాంచందర్ కు జర్నలిస్టులు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జర్నలిస్టుల వృత్తిలో ఏళ్ల తరబడి నుండి ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటూ పనిచేస్తూన్న తమకు నివాసాల కోసం ప్లాట్లు అందజేయాలని అన్నారు.
తహసిల్దార్ కార్యాలయం ముందు గల 340 సర్వే నంబరులో 2008లో తమకు ప్లాట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. అప్పట్లో కస్తూర్బా గాంధీ పాఠశాల మంజూరు కావడంతో ఆ స్థలంలో కస్తూర్బా గాంధీ పాఠశాలను నిర్మించడం ద్వారా జర్నలిస్టులు ఇళ్ల స్థలాలు కోల్పోవడం జరిగిందని అన్నారు. 2014 వరకు మంత్రిగా పనిచేసిన సుదర్శన్ రెడ్డి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను అందజేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆదుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు కిరణ్, నాగరాజు, కోశాధికారి గంగాధర్ గౌడ్, సంయుక్త కార్యదర్శి రవి, సభ్యులు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.