ప్రజా పంథానే జనతా ప్రజాతంత్ర విప్లవ మార్గం

రెంజల్‌, ఫిబ్రవరి 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా ఉద్యమాల నిర్మాణంతో ప్రజాపంథ మార్గంలోనే జనతా ప్రజాతంత్ర విప్లవం సాధ్యమవుతుందని సిపిఐ ఎంఎల్‌ ప్రజాపంథా సబ్‌ డివిజన్‌ కార్యదర్శి డి రాజేశ్వర్‌ అన్నారు. సిపిఐ ఎంఎల్‌ ప్రజాపందా ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రెంజల్‌ మండలం తాడ్‌ బిలోలి, బోర్గం, నీలా గ్రామాల్లో బుధవారం ప్రజాపంథా జండా ఆవిష్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో అశేష ప్రజానీకాన్ని విప్లవోద్యమంలో మమేకం చేసి ప్రజాసంఘాల నిర్మాణంతో పాటు ప్రజా ఉద్యమం చేయాలని ఆయన అన్నారు. పేద ప్రజలే చరిత్ర నిర్మాతలని చరిత్ర రుజువు చేస్తుందని అన్నారు. ప్రజానీకాన్ని విప్లవద్యమంలో మమేకం చేయవలసిన బాధ్యత విప్లవ పార్టీ ప్రజపంథా భుజస్కంధాలపై వేసుకుంటుందని సమాజ స్థాపనకు విప్లవం విజయవంతం ప్రజలందరూ ప్రజా ఉద్యమాల్లో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని మారుతున్న పరిస్థితుల కనుగుణంగా ఎత్తుగడలు పంథాలు మార్చుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు.

ప్రజాతంత్ర విప్లవ సాధనకై ప్రజా చైతన్యంతో ఉద్యమిస్తోందని ఆ మార్గంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్‌ ప్రజాపంథా నాయకులు పి రాజేశ్వర్‌, పెద్దులు, నాగన్న, ఒడ్డెన్న, నసిర్‌, గోపాల్‌, పోశెట్టి, మొనయ్య, అరిఫ్‌, హైమద్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »