నిజామాబాద్, ఫిబ్రవరి 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగర శివారులోని మల్లారం గ్రామ పరిధిలో ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన ధాత్రి టౌన్ షిప్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం సందర్శించారు. క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు.
తొలివిడతగా గత నవంబర్ మాసంలో వేలం పాట నిర్వహించిన ప్లాట్లను పరిశీలించి, వాటికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. టౌన్ షిప్ లో మౌలిక సదుపాయాల కల్పన పనులు ఎప్పటిలోగా పూర్తవుతాయని ఆరా తీశారు. పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్దీఓ రవి, నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ అనిల్, టీఎస్ఐఐసి జిల్లా మేనేజర్ దినేష్ తదితరులు ఉన్నారు.