రికార్డు టైంలో హై లెవెల్‌ వంతెనల నిర్మాణాలు పూర్తి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్‌, మోతె గ్రామాల్లో రికార్డు సమయంలో హై లెవెల్‌ వంతెనల నిర్మాణాలు పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషం కలిగించిందని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి హర్షాతిరేకాలు వెలిబుచ్చారు.

వేల్పూర్‌ పెద్దవాగు పై రూ. 15 కోట్లతో నూతనంగా నిర్మించిన హై లెవల్‌ బ్రిడ్జ్‌ తో పాటు, మోతె కప్పల వాగు పై రూ. 12 కోట్లతో నూతనంగా నిర్మించిన హై లెవల్‌ బ్రిడ్జ్‌ లను మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అట్టహాసపు ఏర్పాట్ల నడుమ గురువారం ప్రారంభోత్సవాలు చేశారు. ఈ వారధుల నిర్మాణాలతో వేల్పూర్‌-భీంగల్‌ మార్గంలో రవాణా సదుపాయం మరింతగా మెరుగుపడినట్లయ్యింది.

ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ, కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే తన సొంత నియోజకవర్గంలో రెండు హై లెవెల్‌ వంతెనలను పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. ఇంత స్వల్ప వ్యవధిలో బ్రిడ్జిల నిర్మాణాలు పూర్తి చేయవచ్చని ఆచారణాత్మకంగా నిరూపించిన ఆర్‌ అండ్‌ బీ అధికారులు, స్థానిక కాంట్రాక్టర్లను మంత్రి అభినందించారు.

రికార్డు టైంలో పూర్తయిన వేల్పూర్‌, మోతే బ్రిడ్జిలు రాష్ట్రానికి మార్గదర్శకంగా నిలువబోతున్నాయని పేర్కొన్నారు. బ్రిడ్జిల నిర్మాణాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల తరపున మంత్రి ప్రశాంత్‌ రెడ్డి కృతజ్ఞతలు ప్రకటించారు. కార్యక్రమాల్లో ఆర్‌అండ్‌బీ ఎస్‌.ఈ రాజేశ్వర్‌ రెడ్డి, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »