ఎడపల్లి, ఫిబ్రవరి 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పరిశుభ్రత దైవంగా నిర్వచించి.. స్వచ్ఛత కోసం పరితపించి.. చీపురుతో వీధులను.. తన భక్తి కీర్తనలతో ప్రజల మనసులను పరిశుభ్రం చేసిన సంఘ సంస్కర్త, వాగ్గేయ కారులు సంత్ గాడ్గే బాబా అని ఎడపల్లి మండల రజక సంఘం ప్రధాన కార్యదర్శి మల్లెపూల శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు సంత్ గాడ్గే బాబా 147వ జయంతిని ఎడపల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… సామాజిక న్యాయం కోసం ఆ మహనీయుడు అవిశ్రాంతంగా పోరాడారని, తన యావత్ జీవితాన్ని సమాజ సేవ కోసం అర్పించిన సర్వసంగ పరిత్యాగి అన్నారు. గాడ్గే బాబా పేరుతో మహారాష్ట్ర అంతటా ప్రాచుర్యం పొందిన ఆయన అసలు పేరు డేబూ లేదా డేబూజి అని 1876 సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీన మహారాష్ట్ర జిల్లాలోని దర్యాపూర్ జిల్లా షేన్ గ్రామంలో జింగారా, శకు అనే దంపతులకు గాడ్గేబాబా జన్మించారని చెప్పారు.
కార్యక్రమంలో ఎడపల్లి మండల రజక సంఘం ప్రధాన కార్యదర్శి మల్లెపూల శ్రీనివాస్, స్థానిక రజక సోదరులు మల్లెపూల శ్రీను, మల్లెపూల భాస్కర్, మల్లెపూల సుదర్శన్, మల్లెపూల సాయిలు, మల్లెపూల భూమయ్య, మల్లెపూల నవీన్, పూలకంటి బాబాయ్య పాల్గొన్నారు.