లింగంపేట్, ఫిబ్రవరి 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లింగంపేట్ మండల ముంబాజిపేట్ తాండ కి చెందిన బి.ఆర్.ఎస్ కార్యకర్త పరశురామ్, బానోత్ గోపాల్ బైక్పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆటో ఢీ కొని తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తులు ప్రమాదం జరిగిందని ఎమ్మెల్యే జాజాల సురేందర్కి సమాచారం అందించిన వెంటనే హుటాహుటిన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అపెక్స్ హాస్పిటల్కు వెళ్లి బాధితులను పరామర్శించారు.
బాధితులతో మాట్లాడి అధైర్యపడొద్దని తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు, అలాగే డాక్టర్లతో మాట్లాడుతూ మెరుగైన చికిత్స అందించాలని వారికి సూచించారు. ఆయన వెంట బి.ఆర్.ఎస్ మండల అధ్యక్షుడు రమేష్, ఎంపీటీసీల పోరం అధ్యక్షుడు సర్వన్, మాజీ ఎంపీపీ సాయిలు, బి.ఆర్.ఎస్ నాయకులు శ్రీకాంత్, తదితరులు ఉన్నారు.