నిజామాబాద్, ఫిబ్రవరి 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యాలయం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ రవీందర్ గుప్తా అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోతుందని ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ అన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా తెలంగాణ విశ్వవిద్యాలయంలో 150 మంది ఉద్యోగులను నియమించడం చట్ట విరుద్ధమని అలాగే విధుల్లో ఉన్న ఉద్యోగులకు ప్రమోషన్ల విషయంలో కూడా అవకతవకలు జరిగాయని ఆయన విమర్శించారు. అర్హతలు లేని వారికి ప్రమోషన్లు కల్పించారని అలాగే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కేవలం ఈ విశ్వవిద్యాలయంలో మాత్రమే నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగాల భర్తీ చేయడం హాస్యాస్పదమని జిల్లాలో విశ్వవిద్యాలయంలో ఇంత అవినీతి జరుగుతుంటే జిల్లా మంత్రికి మరియు స్థానిక ప్రజాప్రతినిధులకు కనీసం నిమ్మకు నీరెత్తినట్లు కూడా వ్యవహరించడం లేదని ఆయన అన్నారు.
రవీందర్ గుప్తా వీసీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి విశ్వవిద్యాలయంలో అవినీతి రాజ్యమేలుతుందని విశ్వవిద్యాలయంలోని అన్ని విభాగాల్లో అవినీతి పేరుకుపోయిందని రవీందర్ గుప్తాను విసి స్థానంలో నుండి తీసివేస్తే గాని విశ్వవిద్యాలయం పరిస్థితి గాడిన పడదని ఆయన అన్నారు. తక్షణమే వేసి రవీందర్ గుప్తా పైన విచారణ జరిపించి నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగాలు ఎలా భర్తీ చేశారో వివరణ కోరాలని అలాగే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వీసి రవీందర్ గుప్తా పై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆయనను సస్పెండ్ చేయాలని, లేని పక్షంలో విశ్వవిద్యాలయంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు స్థానిక మంత్రి ప్రశాంత్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులను రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు.
కార్యక్రమంలో వినోద్, అవిన్, నాయకులు సయ్యద్ అష్రాఫ్ , అరుణ్, లక్కీ, సచిన్, అయాన్, తదితరులు పాల్గొన్నారు.