ఆర్మూర్, ఫిబ్రవరి 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి హైస్కూల్లో శుక్రవారం విద్యార్థులకు క్షయ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా క్షయ వ్యాధి పర్యవేక్షకులు సంతోష్ మాట్లాడుతూ క్షయ లేదా టి.బి. అనేది మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల కలిగే అంటు వ్యాధి, టిబి బాక్టీరియం సాధారణంగా దగ్గు మరియు తుమ్ముల సమయంలో గాలిలోకి విడుదలయ్యే చిన్న బిందువుల ద్వారా ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుందన్నారు.
ఈ బ్యాక్టీరియా సాధారణంగా ఊపిరితిత్తులకు సోకుతుంది, కానీ మెదడు, మూత్రపిండాలు లేదా వెన్నెముక వంటి శరీరంలోని ఇతర భాగాలకు కూడా సోకుతుందని, మీరు అకారణంగా బరువు తగ్గడం, నిరంతర దగ్గు, రాత్రిపూట చెమటలు పట్టడం మరియు వివరించలేని జ్వరం ఉన్నట్లయితే మీరు వైద్యుడిని సందర్శించవలసి ఉంటుందన్నారు.
కార్యక్రమంలో పిహెచ్ ఎన్ సుగుణ, డిపిపి ఎం నరేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గంగారం, ఆరోగ్య కార్యకర్తలు జక్కుల మోహన్, శ్యామల, ఆశా కార్యకర్తలు మమత, సుభద్ర, అరుణ, రమ, శిరీష, నవ్య ఉపాధ్యాయుల బృందం తదితరులు పాల్గొన్నారు.