కామారెడ్డి, ఫిబ్రవరి 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉద్యోగులు సమిష్టిగా పనిచేసి కామారెడ్డి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల, పర్యటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం టీజీవో ఆధ్వర్యంలో 2023 డెఈరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.
సామాజిక సేవా కార్యక్రమాలలో గెజిటెడ్ ఉద్యోగులు ముందంజలో ఉండాలని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు తమ విధులను ప్రశాంతంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
కలెక్టరేట్‌కు వచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎక్సైజ్ అధికారి రవీందర్ రాజు, టీజీవో ప్రతినిధులు మొక్కలను అందజేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ దేవేందర్, కార్యదర్శి సాయి రెడ్డి, జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు నరాల వెంకటరెడ్డి, కార్యదర్శి సాయిలు, ప్రతినిధులు శ్రీనివాస్ రెడ్డి, లింగం, అధికారులు పాల్గొన్నారు.