బాన్సువాడ, ఫిబ్రవరి 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 25వ తేదీ శనివారం బాన్సువాడ నియోజకవర్గ స్థాయి కురుమల ఆత్మీయ సమ్మేళనం బాన్సువాడ పట్టణంలోని రెడ్డి సంఘంలో ఉదయం 9 గంటలకు నిర్వహించబడుతుందని కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ కురుమ, జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్ కురుమ తెలిపారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి విచ్చేస్తున్నారని, కావున నియోజకవర్గ కురుమ కుల బాంధవులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.