గాంధారి, ఫిబ్రవరి 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాకతీయ మెడికల్ కాలేజీలో వైద్యావిద్యను అభ్యశిస్తున్న దరావత్ ప్రీతి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన నిందితుడు సైఫ్‌ను కఠినంగా శిక్షించాలని ఎల్లారెడ్డి గోర్ సేనా ఇంచార్జి లక్ష్మణ్ రాథోడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం గాంధారి తహసీల్దార్ గోవర్ధన్‌కు గోర్ సేనా తరుపున వినతి పత్రం అందజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకొని నిందితుడిని కఠినంగా శిక్షిస్తే భావితరాలకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ సందర్బంగా లక్ష్మణ్ రాథోడ్ మాట్లాడుతూ ఎంతో మంది విద్యార్థులు ర్యాగింగ్ భూతానికి బలివుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలల్లో ర్యాగింగ్ నిషేధం అంటూనే అక్కడక్కడ జరుగుతున్నాయని అన్నారు. గిరిజనులు ఉన్నత స్థాయికి ఎదగడమే కష్టంగా ఉన్న ఈ లాంటి సందర్భాలలో ప్రీతి లాంటి గిరిజన విద్యార్థి దుర్మార్గుల చేష్టలకు బలి అవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ర్యాగింగ్‌ను పూర్తిగా నిషేదించక పొతే విద్యార్థులకు రాబోయేది చీకటి రోజులే అని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితుడిని కఠినంగా శిక్షించాలని తహసీల్దార్‌కు వినతిపత్రంలో కోరారు. కార్యక్రమంలో గోర్ సేనా నాయకులు పరశురామ్, గబ్బర్ సింగ్, సురేందర్, దశరథ్, డాక్టర్ వెంకట్, జమున రాథోడ్, తుకారాం, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.