గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లెల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని టిఎస్‌ ఆర్టిసి చైర్మన్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. తెలంగాణ ప్రభుత్వము గిరిజన సంక్షేమ శాఖ సిరికొండ మండలంలోని చీమన్‌ పల్లి టు జంగ్యాల్‌ తాండ నుండి 3 కి.మీల వరకు బి.టి. రోడ్డు నిర్మాణము రూ. 2.70 కోట్లు రూపాయలతో నిర్మించనున్న పనులకు శనివారం టిఎస్‌ ఆర్టిసి చైర్మన్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, జిల్లా ఒలంపిక్‌ ఉపాధ్యక్షులు ధర్పల్లి జెడ్పిటిసి బాజిరెడ్డి జగన్మోహన్‌ చేతుల మీదగా శంఖుస్థాపన చేశారు.

అనంతరం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రహదారుల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తుందన్నారు. మారుమూల గ్రామాలలో సైతం రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు సీఎం కోట్ల అధిరూపాయల నిధులను కేటాయిస్తున్నారన్నారు. పల్లెల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు గ్రామాల సర్వతో ముఖాభివృద్ధికి ప్రభుత్వం పాటుపడుతుందని అని అన్నారు.

బిజెపి కేంద్ర ప్రభుత్వం మత రాజకీయాలు చేయడం తప్ప చేసింది శూన్యం, నేటి యువతని సోషల్‌ మీడియాలో తప్పుడు సంకేతాలు పంపుతూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కావున యువత మేలుకొని ఎవరు సరైన నాయకుడు వారిని ఎంచుకోవాలని యువకులకు సూచించారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్‌, తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు కావున మనమందరం కేసీఆర్‌ వెంట ఉండి మరింత అభివృద్ధి చేసుకుందాం అన్నారు.

కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ సంగీత రాజేందర్‌, జెడ్పీటీసీ మాన్సింగ్‌ నాయక్‌, స్థానిక సర్పంచ్‌ శివారెడ్డి, మండల బిఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్‌, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ఆకుల తిరుమల్‌, యూత్‌ అధ్యక్షులు చిగురు శ్రీనివాస్‌, జిల్లా రైతు బంధు అధ్యక్షులు మంజుల, రాజేందర్‌, ప్రభాకర్‌, జితేందర్‌, పిఎస్‌సిఎస్‌ చైర్మన్‌, రాజేందర్‌, సర్పంచుల పోరం అధ్యక్షులు రమేష్‌, వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచ్లు, ఎంపిటిసిలు, చుట్టుపక్క గ్రామాల బిఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, ఏప్రిల్‌.5, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »