జి 20 జాతీయ సదస్సులో పాల్గొన్న గవర్నర్‌

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో శనివారం ఉదయం జరిగిన ‘ఇండియాస్‌’ జి 20 ప్రెసిడెన్సీ ఆపర్చినిటీస్‌ అండ్‌ చాలెంజెస్‌ ఫర్‌ ఇండియా యాస్‌ ది గ్లోబల్‌ లీడర్‌’’ అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సుకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ మరియు పాండిచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ డా. తమిళిసై సౌందర రాజన్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

మొదట ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ గవర్నర్‌కి గౌరవ పూర్వకంగా స్వాగతం పలికారు. 7 వ బెటాలియన్‌ పోలీస్‌ సిబ్బందితో ‘గాడ్‌ ఆఫ్‌ ఆనర్‌’ (గౌరవ పూర్వక వందనం) చేశారు. వేద పండితుల ప్రవచనాలతో కూడి పూర్ణకుంభంతో గవర్నర్‌కు స్వాగతం పలికారు. తెలంగాణ విశ్వవిద్యాలయం మరియు అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్‌ మహాసంఫ్‌ు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న జాతీయ సదస్సును జ్యోతి ప్రజ్జ్వలనం చేసి ప్రారంభించారు.

కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, ఎబిఆర్‌ఎస్‌ఎం జాతీయ సంయుక్త కార్యనిర్వహణా కార్యదర్శి గుంత లక్ష్మణ్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య బి. విద్యావర్ధిని, ప్రిన్సిపాల్‌ ఆచార్య సిహెచ్‌. ఆరతి, వీసీ సతీమణి సౌభాగ్యలక్ష్మి, సదస్సు డైరెక్టర్‌ డా. సత్యనారాయణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ భారతదేశం జి20 అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన దృష్ట్యా, అత్యంత శక్తివంతమైన దేశాలకు నేతృత్వం వహిస్తున్న నేపథ్యంలో డి గ్రూప్‌ ఆఫ్‌ నేషన్స్‌, యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యుజిసి), న్యూఢల్లీి, దేశంలోని విశ్వవిద్యాలయాలు మరియు అన్ని ఉన్నత విద్యా సంస్థలను తన జి20 కింద విభిన్న కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించిందన్నారు.

భారతదేశం అత్యంత వేగవంతంగా అభ్యున్నతి చెందుతున్న దేశంగా, స్వయం శక్తితో ఎదుగుతున్న దేశంగా వెల్లడిరచారు. 20 దేశాలకు ఆధిపత్యం వహిస్తున్న సందర్భంలో భారతీయులమైన మనం అపారమైన గర్వం పొందుతున్నామని అన్నారు. తన కలను సాకారం చేసుకొనే దిశగా పయనించిందన్నారు. ఇది వరకు భారతదేశం ప్రపంచ దేశాల నుంచి అన్ని వస్తువులను ఎగుమతి చేసుకొనేదని అన్నారు. కాని ఇప్పుడు భాత దేశం ఒక శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందన్నారు.

85 శాతం అంతర్జాతీయ స్టార్టప్‌ కంపెనీలు మన దేశ సహకారం కోసం ఎదురుచూస్తున్నాయని అన్నారు. కరోనా మహమ్మారిని తట్టుకొని వాక్సినేషన్‌ ను తయారుచేసి దాదాపు 150 దేశాలకు సరఫరా చేసిన ఘనత మన దేశానికి ఉందన్నారు. ఇదే గాక రుబెల్లా, పోలియో వ్యాధులకు వాక్సిన్‌ తయారు చేసి అతి ప్రాణాంతమైన వ్యాధులకు చికిత్సను అందిస్తుందన్నారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు వంటి అనే నినాదంతో భారతదేశం సర్వ స్వతంత్ర దేశంగా ఎదుగుతుందని అన్నారు. పెద్దవాళ్లను గౌరవించడం, వర్తమాన కాలంలో పరిస్థితులకు అనుగుణంగా అవసరాలను తీర్చడం, భవిష్యత్‌ తరాలకు బంగారు బాటను అందించడం కోసం ప్రయత్నం చేయడం భారతదేశం మీద ఉన్న ఒక బాధ్యత అని ఆమె అన్నారు.

భారతదేశ చరిత్ర అజరామరం అయ్యిందన్నారు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటం ప్రపంచ దేశాలకు శాంతి, అహింస మార్గాలను చూపిందన్నారు. భారతీయ ధార్మిక, ఆధ్యాత్మిక, తాత్త్విక, భక్తి సాక్షాత్కారం యోగా వల్ల కలుగుతుందన్నారు. భారతదేశం చూపిన యోగా ధ్యాన విద్య అంతర్జాతీయ పరంగా మంచి మార్గాన్ని నిర్దేశించిందన్నారు. ఈ 2023 వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ‘‘ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ మిల్లెట్స్‌’’ అనే సంక్షిప్త సందేశంతో ముందుకు వెళ్తుందని అన్నారు. సంపూర్ణ చిరుధాన్యాల ఆహారం మన భారతీయుల సంస్కృతి. ఇలాంటివి అలవాటు చేసుకోవాలని అన్నారు. భవిష్యత్తు తరాలకు పరిసరాల పరిశుభ్రతతో పాటుగా, పచ్చదనం అలవాటు చేసుకొనే విధంగా శిక్షణ ఇవ్వాలని అన్నారు.

విద్యార్థులు వ్యక్తిగత స్వయం సమృద్ధిని సాధించే దిశగా పయనించాలని అన్నారు. ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా ఎదగడానికి ఉన్న చాలెంజెస్‌ ఏమిటో వివరించారు. ఇదివరకు ఎన్‌ఇపి 2020 ద్వారా క్లాస్‌ రూం నుంచి గ్లోబల్‌గా ఎదగడానికి అనువైన సబ్జెక్టులు ఉన్నాయని అన్నారు. ప్రపంచ దేశాలలో పరిణామాలకు అనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి విద్యా, విజ్ఞానం సాధిస్తూ స్కాలర్‌ షిప్‌లను పొందాలని అన్నారు. తరతరాల నుంచి మన దేశం ప్రసాదించిన శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకొని అభివృద్ధి చెందాలని అన్నారు.

ప్రపంచ దేశాలలో సంక్షోభాన్ని ఎదుర్కంటున్న ఉక్రేయిన్‌, సిరియా దేశాలకు స్నేహ వారధి అందించవలసిన అవసరం ఉందని అన్నారు. మనం మన దేశ పౌరులుగా దేశంలో జీవిస్తున్నందుకు గర్వ పడాలని అన్నారు. విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్రలను చదివి స్ఫూర్తి పొందాల్ని అన్నారు. యువత ఏదైనా సాధించగలరని అసాధారణ ప్రతిభ ఉంటుందని అన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »