కామారెడ్డి, ఫిబ్రవరి 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పది రోజుల వ్యవధిలో అడ్లూరు శివారులోని ధరణి టౌన్షిప్లో మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను కోరారు. ధరణి టౌన్షిప్ లో మౌలిక వసతుల కల్పనపై అధికారులతో జిల్లా కలెక్టర్ శనివారం సమీక్ష నిర్వహించారు.
విద్యుత్ సౌకర్యం, అంతర్గత రోడ్లు, రక్షణ గోడ నిర్మాణం పనులు పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. పనుల పురోగతిపై సంబంధిత శాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి, ధరణి టౌన్షిప్, మున్సిపల్, ఆర్ అండ్ బి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.