కామారెడ్డి, ఫిబ్రవరి 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డిని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి మున్సిపల్ 2023-24 బడ్జెట్ సమావేశం శనివారం పట్టణంలోని కళాభారతిలో మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
పట్టణ ప్రజలకు అవసరమైన పనులను గుర్తించి బడ్జెట్ ను వినియోగించాలని తెలిపారు. మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు సమిష్టిగా కృషి చేయాలని చెప్పారు. పట్టణంలో నీటి ఎద్దడిని పరిష్కరించడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని పేర్కొన్నారు. 01 -04-2023 నాటి అంచనా ప్రారంభ నిలువ రూ. 2566.65 ఉంది.
2023-24 ఆర్థిక సంవత్సరం అంచనాల ఆదాయం రూ.4858.47 రూపొందించారు.2023-24 అంచనా సాధారణ వ్యయం రూ.4858.47, 31.03.2024 నాటికి ఉండబడు మిగులు బడ్జెట్ రూ.2566.65 ఉందని మున్సిపల్ కమిషనర్ దేవేందర్ చదివి వినిపించారు. కౌన్సిలర్లు చేతులెత్తి బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఇందు ప్రియ, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.