కామారెడ్డి, ఫిబ్రవరి 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల సెవెన్ హార్ట్స్ ఆర్గనైజేషన్ ఎన్జీవో ఆధ్వర్యంలో ఆర్.బి నగర్ బస్తీ అంగన్వాడి కేంద్రంలో అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల దినోత్సవాన్ని పిల్లలకు పలకల వితరణ చేసి జరుపుకున్నారు.
ఈ సదర్భంగా ఎన్జీవో పౌండర్ జీవన్ నాయక్ మాట్లాడుతూ సమ సమాజం మార్పుకోసం సమాజ సేవయే లక్ష్యంగా చేసుకుని ఎన్జీవోలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్త శారద, ఎన్జీవో ప్రతినిధులు మసూద్, సంతోష్, సుధాకర్ పలువురు పాల్గొన్నారు.