కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

రెంజల్‌, ఫిబ్రవరి 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్‌ సునీత బాబునాయక్‌ అన్నారు. సోమవారం మండలంలోని మౌలాలి తాండలో కంటి వెలుగు కార్యక్రమాన్ని వైద్యాధికారి ప్రమోదీతతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు.

18 సంవత్సరాల పైబడిన వారందరూ కంటి పరీక్షలు జరిపించుకోవాలని అవసరమైన వారికి రీడిరగ్‌ గ్లాసులు, ప్రిస్క్రిప్షన్స్‌లో మందులు, మోతి బిందువు ఉన్నవారికి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తామని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వియోగపరుచుకోవాలని అన్నారు. ప్రతి ఒకరికి అవసరం మేరకు ఉచిత మందులతో పాటు కంటి అద్దాలు అందించడం జరుగుతుందని అన్నారు.

కార్యక్రమంలో రైతుబందు జిల్లా సభ్యుడు మౌలానా సొసైటీ మాజీ చైర్మన్‌ సాయరెడ్డి, ఉపసర్పంచ్‌ రవి, పంచాయతీ కార్యదర్శి రజిత, ఆరోగ్య విస్తీర్ణ అధికారులు శ్రావణ్‌ కుమార్‌, కరిపే రవీందర్‌, బిఆర్‌ఎస్‌ నాయకులు సుధాకర్‌, నాయకులు ప్రవీణ్‌, ఉమేష్‌, కొద్దుస్‌, ఆరోగ్య కార్యకర్తలు మంజుల, ఆరోగ్య కార్యకర్తలు తదితరులున్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »