గాంధారి, ఫిబ్రవరి 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండలంలోని మహాదేవుని గుట్టపైకి పైప్ లైన్ ద్వారా నీటి సరఫరాను సోమవారం స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. చాలా రోజులుగా గుట్టపై తాగు నీటి సమస్య ఉందని, భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే సురేందర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించి ఎమ్మెల్యే జిల్లా పరిషత్ ద్వారా 7 లక్షల 50 వేల రూపాయల నిధులు మంజూరు చేశారు.
దీంతో పైప్ లైన్ పనులను ప్రారంభించి పనులను పూర్తి చేశారు. పైప్ లైన్ ద్వారా గుట్ట పైకి తాగు నీటి సరఫరా చేసినందుకు గుడిమెట్ మహాదేవ్ స్వామి, భక్తులు ఎమ్మెల్యే సురేందర్, జడ్పీటీసీ శంకర్ నాయక్, గాంధారి సర్పంచ్ సంజీవ్ యాదవ్, సొసైటీ చైర్మన్ సాయికుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.