ఎడపల్లి, ఫిబ్రవరి 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలోని ఆయా గ్రామాల్లో ని ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం విద్యార్థులు విజ్ఞాన ప్రదర్శన నిర్వహించారు. సర్ సీవీ రామన్ 1928 ఫిబ్రవరి 28 న రామన్ ఎఫెక్ట్ కనుగొనడంతో ప్రభుత్వం ప్రతీ ఏటా ఫిబ్రవరి 28న జాతీయ విజ్ఞాన దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించిందని పలువు హెడ్మాస్టర్‌లు తెలిపారు.
సర్ సివి రామన్ ను ఆదర్శంగా తీసుకొని ప్రతీ విద్యార్థి విజ్ఞాన శాస్త్రంలో జ్ఞానాన్ని సంపాదించి పేరు ప్రతిష్టలు పొందాలన్నారు. ఈ మేరకు మండలోని పలు స్కూళ్లలో సైన్స్ ప్రాజెక్టు లు విద్యార్థులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సైన్స్ ప్రాజెక్ట్‌లను పరిశీలించి విద్యార్థులను ప్రశంసించారు. ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి.
ఈ మేరకు ఆయా స్కూళ్లలో సరస్వతీ దేవి, సర్ సివి రామన్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎంఈఓ రామారావు, ఆయా ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ల హెడ్మాస్టర్లు, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.