కామారెడ్డి, ఫిబ్రవరి 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల వివేకానంద బీట్ ఆఫర్స్ పాఠశాలలో నేడు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శాస్త్ర సాంకేతిక అంశాలపై సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. ఒకటో తరగతి నుండి తొమ్మిదవ తరగతికి చెందిన విద్యార్థులు 48 అంశాలపై వివిధ రూపాలను ప్రదర్శించారు. భౌతిక రసాయన జీవశాస్త్ర అంశాలపై నిజరూపకలు తయారు చేసి వాటి గురించి వివరంగా సందర్శకులకు విశదీకరించారు.
పాఠశాల కరస్పాండెంట్ గురువింద రెడ్డి ప్రదర్శనను ప్రారంభించి విద్యార్థుల నుండి ప్రదర్శనకు చెందిన అంశాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులు విద్యతోపాటు ఎన్నో విలువైన నైపుణ్యం మెలకువలను నేటి పోటీ ప్రపంచానికి అనుగుణంగా నేర్పించడం జరుగుతున్నదన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధ్యాపక బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో ఆర్యభట్ట కళాశాల ప్రిన్సిపాల్ హనుమంతరావు, పాఠశాల ప్రిన్సిపాల్ వీరభద్రప్ప, డైరెక్టర్లు పున్న రాజేష్, ఏనుగు రవి రెడ్డి, శ్రీనివాసరావు, ప్రభు, ఆధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.