బాన్సువాడ, ఫిబ్రవరి 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రశాంత్ కాలనీకి చెందిన టిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం బిజెపి జిల్లా అధ్యక్షురాలు అరుణాతార ఆధ్వర్యంలో బిజెపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్ట్రీట్ కార్నర్ కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడారు.
టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు అమలుకాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చి ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందించలేదని కేవలం ఓటు బ్యాంకుగానే ప్రజలను చూస్తున్నారని ప్రజా సంక్షేమాన్ని విస్మరించి అధికార పార్టీ నాయకులు కోట్లకు పడగలెత్తుతున్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పాలనను నియోజకవర్గంలో ఇంటింటికి చేరువేయాలని ఆమె కార్యకర్తలకు సూచించారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరముంది, కావున ప్రతి కార్యకర్త కష్టపడి పార్టీ కోసం పని చేయాలన్నారు.
కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ శ్రీధర్ పంతులు, జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లికార్జున్ దేశాయ్, ఎస్టి మోర్చా ప్రధాన కార్యదర్శి పండరి, పత్తి రమేష్, శ్రీకాంత్, గోపాల్ చారి, పార్టీలో చేరిన వారు హైమధ్, శంకర్, బాలరాజు మనోజ్, మౌలానా, ముజీబ్, నారాయణ, షాదుల్, సాకలి సాయిలు, రాము, సంతోష్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.