Monthly Archives: February 2023

ఎర్రజొన్న కొనుగోళ్లలో బైబ్యాక్‌ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని ఆయా మండలాల్లో రైతులు సాగు చేసిన ఎర్రజొన్న పంటను బైబ్యాక్‌ ఒప్పందానికి అనుగుణంగా సీడ్‌ వ్యాపారులు కొనుగోలు చేసేలా క్షేత్ర స్థాయిలో పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్లో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌తో కలిసి …

Read More »

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ స్థాయిలో ఆరోగ్య పోషణ రోజును ప్రతినెల మొదటి వారంలో జరిగే విధంగా ఐసిడిఎస్‌ అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం పోషణ అభియాన్‌ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. మార్చి నెలలో 15 రోజులపాటు పోషణ పక్షోత్సవాలు నిర్వహించాలని తెలిపారు. …

Read More »

ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన వేడుకలు

బాన్సువాడ, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని స్పీకర్‌ పోచారం నివాసంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన పురస్కరించుకొని సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి నాయకులతో కలిసి కేక్‌ కట్‌చేసి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కొరకు అనునిత్యం పాటుపడుతూ కేవలం ఎనిమిది సంవత్సరాలలోనే రాష్ట్ర భవిష్యత్తును అద్భుతంగా మార్చి రాష్ట్ర ఆదాయాన్ని గణనీయంగా పెంచారన్నారు. …

Read More »

46 వాహనాలు సీజ్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిజిల్లా వ్యాప్తంగా పన్నులు చెల్లించకుండా తిరుగుతున్న 4725 వాహనాలలో, గురువారం జరిగిన వాహన తనిఖీ కార్యక్రమంలో 46 వాహనాలను తనిఖీ చేసి, అక్కడికక్కడే సీజ్‌ చేసినట్టు జిల్లా రవాణా శాఖ అధికారిణి డాక్టర్‌ ఎన్‌ వాణి తెలిపారు. పన్ను చెల్లించని వాహనాల యజమానులు స్వచ్చందంగా వచ్చి త్రైమాసిక పన్నులు చెల్లించిన ఎడల ఇప్పటి వరకే విధించిన జరిమానా (పెనాల్టీ) …

Read More »

ధాన్యం కొనుగోలు కోసం ప్రణాళిక సిద్దం చేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యాసంగి 2023 ధాన్యం కొనుగోలు కోసం జిల్లా అధికారులు ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో గురువారం యాసంగి ధాన్యం కొనుగోలు పై వ్యవసాయ, మార్కెటింగ్‌, ఐకెపి, సివిల్‌ సప్లై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారులు వచ్చే ధాన్యం దిగుబడిని అంచనా వేయాలని …

Read More »

మహిళా దినోత్సవం సందర్బంగా దరఖాస్తుల ఆహ్వానం

కామరెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మహిళా సాధికారత, ఆర్ధిక సామాజిక రంగాల్లో అత్యుతమ ప్రతిభ కనబరిచిన వారి నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తునట్లు జిల్లా సంక్షేమ ఆధికారి పి .రమ్య పేర్కొన్నారు. మార్చి 8 న నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మహిళా సామాజిక, ఆర్ధిక సాధికారత రంగాల్లో అసాధారణమైన పరిస్థితులలో అత్యుతమంగా పని చేసిన మహిళా సాధకులకు …

Read More »

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

రెంజల్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని దూపల్లి గ్రామానికి చెందిన పల్లె సాయిలు (35) అనే వ్యక్తి పురుగుల మందు తాగి మృతి చెందినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 14వ తేదీన అనారోగ్య కారణంగా పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో చికిత్స నిమిత్తం నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ …

Read More »

లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లతో వివిధ అంశాలపై సి.ఎస్‌ సమీక్ష నిర్వహించారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ పథకంతో పాటు కంటి వెలుగు, పోడు భూములు, జీ.ఓ నెం.లు 58 …

Read More »

ప్రభుత్వ కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలి

కామారెడ్డి ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు, పోడు పట్టాల పంపిణీ, జీవో నెంబర్‌ 58, 59, 118 తో పాటు, తెలంగాణకు హరితహారం లాంటి కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. హైదరాబాద్‌ నుండి కలెక్టర్లు అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ లో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, జిల్లా స్థానిక …

Read More »

శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం

రెంజల్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 17వ తేదీ శుక్రవారం రెంజల్‌ మండల సర్వసభ్య సమావేశం మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షురాలు రజిని కిషోర్‌ అధ్యక్షతన నిర్వహించడం జరుగుతుందని సుపరిండెంట్‌ శ్రీనివాస్‌ తెలిపారు. సమావేశానికి వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరు హాజరుకావాలని ఆయన అన్నారు.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »