నగరంలో దోమల బెడద నివారణకు చర్యలు

నిజామాబాద్‌, మార్చ్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ దోమల నివారణకు మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు తగు చర్యలు చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి. సుధాకర్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం నగరపాలక సంస్థ మేనేజర్‌ జనార్ధన్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్‌ మాట్లాడుతూ నిజామాబాద్‌ మున్సిపల్‌ నగరపాలక సంస్థ పరిధిలో దోమల బెడద ఎక్కువగా ఉన్నందున నగరంలో నివసించే వారికి మలేరియా, టైఫాయిడ్‌, చికెన్‌ గున్యా, డెంగ్యూ వివిధ రకాల వ్యాధులకు గురవుతున్నారని అన్నారు. వెంటనే మున్సిపల్‌ అధికారులు చొరవ చూపి నగరంలోని వీధులలో దోమల నివారణ పొగ పిచికారి చేసి దోమల బెడదను తగ్గించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిందిగా కోరారు.

కార్యక్రమంలో సిపిఐ దక్షిణ మండల కార్యదర్శి పి.రంజిత్‌ కుమార్‌, ఉత్తర మండల కార్యదర్శి పి.ముత్యాలు, నాయకులు రాధ, కుమార్‌ పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, జనవరి.31, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »