బీర్కూర్, మార్చ్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి వాటిలోని విలువైన రాగి తీగలు, ఆయిల్ చోరీలకు పాల్పడిన ముఠా బాన్సువాడ నియోజకవర్గంలో తిరుగుతున్నట్లు సమాచారం. బీర్కూర్ తెలంగాణ తిరుమల దేవస్థానం ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవ వేడుకల్లో ట్రాన్స్‌కో అధికారులు, పోలీస్‌లు నిమగ్నం కాగా, ఇదే అదునుగా చూసుకొని ట్రాన్స్‌ఫార్మర్ల దొంగలు బీర్కూర్ మంజీరా నది పరివాహక ప్రాంతంలో ఉన్న 8 వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లను పగలగొట్టి …
Read More »Daily Archives: March 2, 2023
పేదల కడుపు కొడుతూ… ఆదాని, అంబానీలకు దోచి పెడుతున్న మోడీ
నిజామాబాద్, మార్చ్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రధానమంత్రి మోడీ పేద ప్రజల కడుపు కొడుతూ తన స్నేహితులైన ఆదాని, అంబానీలకు దోచిపెడుతున్నారని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. గ్యాస్ ధరలు గడియ గడియకు పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్నారని, ఆడ బిడ్డలకు మరింత భారంగా మార్చుతున్నారని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ధర్నా …
Read More »కంటి వెలుగు శిబిరాల పరిశీలన
ఆర్మూర్, మార్చ్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ 20 వ వార్డులో గల కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా పరిశీలకుడు డాక్టర్ వెంకటేష్ సందర్శించి కంటి వెలుగు కొనసాగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు తమకు ఇచ్చిన టార్గెట్‌ను పూర్తిచేయాలని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు జరిగేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో …
Read More »మైనార్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమిపూజ
రెంజల్, మార్చ్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని బోర్గాం గ్రామంలో మైనారిటీ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి సర్పంచ్ వాణీసాయిరెడ్డి, ఉపసర్పంచ్ ఫెరోజోద్దీన్ గురువారం భూమి పూజ చేశారు. సిడిపి నిధుల ద్వారా మంజూరైన రూ.10 లక్షల రూపాయలతో పనులను ప్రారంభించడం జరిగిందని అన్నారు. అడిగిన వెంటనే రూ.10 లక్షలు మైనార్టీ భవనం నిర్మాణం కోసం కృషి చేసిన ఎమ్మెల్యే షకీల్ అమీర్ రుణపడి …
Read More »చదువులో రాణించి తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడాలి
రెంజల్, మార్చ్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులు చదువుతో పాటు తల్లిదండ్రులను గౌరవించాల్సిన బాధ్యత ఉండాలని మండల విద్యాశాఖాధికారి గణేష్ రావు అన్నారు. గురువారం మండలంలోని సాటాపూర్‌లోని యూనీక్ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. సంస్కృతి, సాంప్రదాయాలు దేశభక్తిని చాటే నృత్యాలు చేసి చూపరులను అలరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎంఈఓ గణేష్ రావు …
Read More »విద్యార్థి దశ నుండే భవిష్యత్ నిర్దేశించుకోవాలి
బోధన్, మార్చ్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులు విద్యార్థి దశ నుండి భవిష్యత్ ను నిర్దేశించుకోవాలని బోధన్ ఎమ్మెల్యే షెకిల్ ఆమెర్ విద్యార్థులకు సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నిక్కత్ కౌసర్ ఆధ్వర్యంలో కళాశాల వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే షకీల్, జిల్లా విద్యాధికారి లోకం రఘురాజ్, ధర్పల్లి కళాశాల ప్రధాన ఉపాధ్యాయులు రఫీ యుద్దీన్, హాజరయ్యారు. …
Read More »కెనాల్‌లో దూకి మహిళ ఆత్మహత్య
ఎడపల్లి, మార్చ్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామానికి చెందిన ఓ మహిళ మనస్తాపంతో గ్రామ శివారులోని కెనాల్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడిరది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జాన్కంపేట్ గ్రామానికి చెందిన వడ్డెర లక్ష్మీ (42) అనే మహిళ గ్రామశివారులోని కెనాల్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం కెనాల్‌లో ఓ మహిళ శవం తేలి …
Read More »ఈశాన్య రాష్ట్రాల్లో బిజెపి విజయం పట్ల సంబరాలు
నిజామాబాద్, మార్చ్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇటీవల జరిగిన మూడు రాష్ట్రాల ఎన్నికల్లో ఈరోజు వెలువడిన ఫలితాల్లో బిజెపి అఖండ విజయం సాధించడం పట్ల నిజామాబాద్ న్యాయవాదుల ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ముందర టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా న్యాయవాద పరిషత్తు జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ దేశంలోని ప్రతి పౌరుడు భారతీయ జనతా పార్టీ వైపు …
Read More »తేనెటీగల పెంపకం చేపట్టాలి
కామారెడ్డి, మార్చ్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెండు మండలాల్లో తేనెటీగల పెంపకం కోసం మహిళా సంఘాలను ఎంపిక చేసి లబ్ధిదారులను గుర్తించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. గాంధారి, రాజంపేట మండలాల్లో అటవీ ప్రాంతం అధికంగా ఉన్నందున తేనెటీగల పెంపకం స్వయం సహాయక సంఘాల మహిళలతో చేపట్టాలని చెప్పారు. కార్యక్రమంలో డిఆర్‌డిఓ సాయన్న, జిల్లా ఉద్యానవన అధికారి విజయభాస్కర్, జిల్లా వ్యవసాయ అధికారిని …
Read More »