రెంజల్, మార్చ్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని బోర్గాం గ్రామంలో మైనారిటీ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి సర్పంచ్ వాణీసాయిరెడ్డి, ఉపసర్పంచ్ ఫెరోజోద్దీన్ గురువారం భూమి పూజ చేశారు. సిడిపి నిధుల ద్వారా మంజూరైన రూ.10 లక్షల రూపాయలతో పనులను ప్రారంభించడం జరిగిందని అన్నారు.
అడిగిన వెంటనే రూ.10 లక్షలు మైనార్టీ భవనం నిర్మాణం కోసం కృషి చేసిన ఎమ్మెల్యే షకీల్ అమీర్ రుణపడి ఉంటామని వారు అన్నారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూంరెడ్డి, బిఆర్ఎస్ నాయకులు రాజు, లక్ష్మణ్, ఖదీర్, సిద్ధ పోశెట్టి, సాయరెడ్డి తదితరులు ఉన్నారు.