బోధన్, మార్చ్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులు విద్యార్థి దశ నుండి భవిష్యత్ ను నిర్దేశించుకోవాలని బోధన్ ఎమ్మెల్యే షెకిల్ ఆమెర్ విద్యార్థులకు సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నిక్కత్ కౌసర్ ఆధ్వర్యంలో కళాశాల వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే షకీల్, జిల్లా విద్యాధికారి లోకం రఘురాజ్, ధర్పల్లి కళాశాల ప్రధాన ఉపాధ్యాయులు రఫీ యుద్దీన్, హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే షకీల్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు, అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యను అభ్యసించే దశలోనే వారి భవిష్యత్తును నిర్ణయించుకునే అవకాశాలు ఉంటాయన్నారు, విద్యార్థులు విద్య, క్రీడలతో పాటు అన్ని రంగాలలో రాణించాలని సూచించారు. జాబ్ మేళాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు.
విద్యార్థుల కోసం ఆడిటోరియం లేనందున ఆడిటోరియం నిర్మాణానికి కోటి రూపాయల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ విద్యాలయాలో ప్రతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అర్ధించేందుకు కేజీ టు పీజీ విద్యాలయాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు, బిఆర్‌ఎస్ నాయకులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.