ముదిరాజ్‌లకు చట్ట సభల్లో స్థానం కల్పించాలి…

ఎల్లారెడ్డి, మార్చ్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి మండలంలోని సబ్దళ్‌పూర్‌ గ్రామంలో ముదిరాజ్‌ మహాసభ ఆధ్వర్యంలో శనివారం ముదిరాజ్‌ సంఘ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమనికి ముఖ్య అతిథిగా డాక్టర్‌ బట్టు విఠల్‌ ముదిరాజ్‌ పాల్గొని ముదిరాజ్‌ సంఘ సభ్యులతో కలిసి జెండా అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్ట సభల్లో ముదిరాజ్‌లకు పార్టీలు స్థానం కల్పించాలని అదేవిధంగా ముదిరాజ్‌లకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

ముదిరాజ్‌లు వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టి గెలిపించే బాధ్యత ప్రతి ఒక్క ముదిరాజ్‌ బిడ్డపై ఉందన్నారు. ముదిరాజ్‌లలో చాలా కుటుంబాల పరిస్థితి ఆర్థికంగా వెనుకబడిన వారు ఎక్కువగా వున్నారు కాబట్టి అవసరమైన చోట మత్స్యకార సంఘాల్లో చోటు కల్పించాలని అన్నారు. బిసి డి నుండి బీసీ ఏ కు ముదిరాజ్‌లను మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం జి ఓ ఇవ్వాలని పేర్కొన్నారు.

రాష్ట్రంలో అధిక జనాభా కలిగిన కులం ముదిరాజ్‌ అని పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు తప్ప ఏ పార్టీలు ముదిరాజ్‌లకు న్యాయం చేయటం లేదని అన్నారు. ముదిరాజ్‌లందరు ఒక్కటై వచ్చే ఎన్నికల్లో ముదిరాజ్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌ కుడుముల సత్యనారాయణ ముదిరాజ్‌ మాట్లాడుతూ ముదిరాజ్‌లందరు ఐక్యతతో ఉండాలని అన్నారు. భవిష్యత్‌ రాజకీయాలలో రాణించాలంటే కలిసికట్టుగా మన బిడ్డలే మద్దతు పలకాలని కోరారు. అభివృద్ధి పనులు తన దృష్టికి తీసుకవస్తే ఎమ్మెల్యే సహకారంతో చేయిస్తానన్నారు.

కార్యక్రమంలో మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు తూర్పు రాజు ముదిరాజ్‌ మాట్లాడుతూ జివో 15 ను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. జివో 6 ప్రకారమే చెరువులలో, కాలువలలో సభ్యత్వం ప్రతీ ముదిరాజ్‌కు కల్పించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో మల్లయ్య పల్లి సర్పంచ్‌ ఎల్లయ్య ముదిరాజ్‌, రెపల్లె వాడ సర్పంచ్‌ సాయిరాం ముదిరాజ్‌, సంఘ నాయకులు కోర్న నారాయణ, శ్రీకాంత్‌ ముదిరాజ్‌, సంతోష్‌ ముదిరాజ్‌, అశోక్‌ ముదిరాజ్‌ అంజయ్య ముదిరాజ్‌, వివిధ గ్రామాల మహాసభ నాయకులు, గ్రామ సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Check Also

డిగ్రీ కళాశాలలో యన్‌సిసి సంబరాలు

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »