బోధన్, మార్చ్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులు సమయపాలన పాటిస్తూ చదువుకొని ఉజ్వల భవిష్యత్తు కు బాటలు వేసుకోవాలని బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, డిఐఈఓ రఘు రాజు పేర్కొన్నారు. శనివారం శ్రీ విజయ సాయి జూనియర్ కాలేజ్‌లో నిర్వహించిన పెర్వల్ పార్టీ సెలబ్రేషన్స్‌కు ముఖ్య అతిథిలుగా హాజరై ప్రసంగించారు.
విద్యార్థులు చదువులో ముందుంటు క్రీడలలో కూడా రాణిస్తూ తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులు నిర్వహించిన సాంసృతిక కార్యక్రమాలు చూపరులను ఆకర్షించాయి. కార్యక్రమంలో విజయ సాయి జూనియర్ కాలేజ్ చైర్మన్ పి సుబ్బారావు, డైరెక్టర్స్ శ్రీకాంత్, శ్రీనివాస్ రావు, కృష్ణ ప్రసాద్‌తో పాటు ఇందూర్ హైస్కూల్ కరస్పాండెంట్ కిషోర్, సాయి ప్రసన్న, హైస్కూల్ కరస్పాండెంట్ జయప్రకాష్, లేర్నర్స్ హైస్కూల్ కరస్పాండెంట్ రాధకృష్ణన్, లయోలా హైస్కూల్ కరస్పాండెంట్ సురేష్ నాగల్ల, హన్మంతు రావుతో పాటు కాలేజ్ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.